Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నాయకులు బి.ఎన్. సుదర్శన్
- సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ-బాలానగర్
రైతుల హక్కులను కాలరాసే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని హెచ్ఏఎల్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు బి.ఎన్.సుదర్శన్ డిమాండ్ చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీలో ఏడు నెలలుగా పోరాడు తున్న రైతులకు మద్దతుగా అఖిల భారత కిసాన్ సంఘర్షణ సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం కూకట్పల్లి సర్కిల్, బాలానగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ యూనియన్, హెచ్ఏడబ్ల్యుయూ అధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సంద్భంగా బి.ఎన్. సుదర్శన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు రైతులకు మద్దతుగా పోరాడతామన్నారు. అదేవిధంగా విద్య, వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచి ఆయా రంగాలను బలో పేతం చేయాలని కోరారు. 2020 విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రాజ్యాంగాన్ని కాపాడు కోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా, ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా వ్యవహరిస్తోందని చెప్పారు. దేశ ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ ఐక్యమై తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అన్నీ ఉపసంహరించాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విజరు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి యూనియన్ కార్యదర్శివర్గ సభ్యులు, ఆఫీస్ బెరర్స్ పాల్గొన్నారు.
రైతులకు మద్దతుగా హెచ్ఏఏలో కార్మికుల భారీ ప్రదర్శన
జవహర్‌నగర్‌లో... కేంద్రం తెచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ, పలు ఇతర ప్రజా, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఏడునెలలుగా చేపట్టిన రైతులకు మద్దతుగా శనివారం దేశవ్యాప్త పిలుపులో భాగంగా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్ అంబేద్కర్ విగ్రహంవద్ద కేంద్రం వైఖరిపట్ల నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షేక్ షావలి (ఐ.ఎఫ్.టి.యు., జాతీయ కన్వీనరు), శివన్నారాయణ (సి.ఐ.టి.యు. మేడ్చల్ జిల్లా నాయకులు), టి.కాలేషా (ముస్లి వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి), ఎం. దుర్గా ప్రసాద్ (వికలాంగుల జాతీయ హక్కుల వేదిక, రాష్ట్ర ఉపాధ్య క్షులు), మబ్బు బాలు (తెలంగాణ వికలాంగుల ఐక్యవేదిక వ్యవస్థా పకులు), పి. పుణ్యవతి, పర్వీన్, వై.సునీత, భవాని (పీఓడభ్ల్యూ), రాజు (అరుణోదయ), సంఘం. క్రిష్ణ(బిఎస్పీ) పాల్గొన్నారు.