Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30తులాల బంగారం, 3కిలోల 20తులాల వెండి, ఒక వాహనం స్వాధీనం
నవతెలంగాణ-హయత్‌నగర్
రాత్రి పూట తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి అందు లో విలువైన వస్తువులను చోరీలు చేస్తున్న పాత నేరస్తు లను హయత్‌నగర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఎల్బీ నగర్లో ఉన్న సీపీ క్యాంప్ కార్యాలయంలో నిందితుల వివరాలను ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ మీడియాకు వెల్లడించారు. దాసరి జంపయ్య, అంగడి రాజు, ఆనరెడ్డి రవి అలియాస్ రమేష్‌ల స్వస్థలం మహబూబ్‌బాద్. ప్రస్తుతం జంపయ్య సికింద్రాబాద్‌లో అంగడి రాజు, హయత్‌నగర్‌లో రమేష్ అడ్డగుట్టలో వుంటున్నారు. జంపయ్య, రమేష్‌లు బంధువులు కావడం తో పాటుగా చెడు అలవాట్లకు బానిసై తాళం వేసి ఉన్న ఇండ్లను రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో చోరీలు చేసేవారు. వారికి తోడు అదే ప్రాంతానికి చెందిన అంగడి రాజు అనే వ్యక్తి కూడా పాత నేరాల్లో జైల్ జీవితం గడిపిన కూడా అతనిలో మార్పు రాలేదు. ప్రస్తుతం హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజు నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు అనువుగా ఉంటుంది అని భావించి ఈనెల 15న రెండు ఇండ్లలో చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీనితో ఫిిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల నిఘా ద్వారా నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 30తులాల బంగారం, 3కిలోల 20తులాల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఆనరెడ్డి రవి అలియాస్ రమేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు సికింద్రాబాద్ తుకారం గేట్లో గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తు పలు దొంగత నాలకు పాల్పడుతున్న వీరిపై హయత్‌నగర్‌లో 10, వనస్థలి పురంలో 2, అబ్దుల్లాపూర్‌మెట్‌లో1, మెదక్, తూఫ్రాన్‌లో 2, కొత్తగూడెంలో2, ఖమ్మంలో1 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ పురోషోత్తం రెడ్డి, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ సురేందర్‌గౌడ్, డిఐ నాగార్జున, ఎస్ఐ నర్సింహా, సిబ్బంది శ్రీనివాస్, హనుమంతు, శ్రీనివాస్, శాంతి స్వరూప్, నవీన్ కుమార్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్, లింగం, సాయి, శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.