Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
నాలా పరివాహక ప్రాంత ప్రజలు మరోసారి వరదలతో నష్టం జరగుకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుం టామని అంబర్‌పేట ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ అన్నారు. శనివారం అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ మూసీి పరివాహక ప్రాంతాలలో పర్యటించి వరద సమస్య నివారణకు తీసుకోవాల్సిన చర్య లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లకుంట డివిజన్ రత్నానగర్ నుండి శివానంద్నగర్, బాపునగర్, పటేల్బాడ, ఎస్టీిపి వాటర్ వర్క్స్ గేట్, అంబర్‌పేటలోని సి బ్లాక్ నాలా పరివాహక ప్రాంతాలలో గతేడాది వచ్చిన వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయా రని అన్నారు. గతేడాది జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచు కుని మోయిన్ చెరువు నుండి ఎస్టీిపి వరకు నాలానూ పూర్తి స్థాయిలో విస్తరింపజేసి వరదలు రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. వరద నీటి సమస్య తలెత్త కుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు అధికారు లు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కార్యక్ర మంలో ఎస్ఎన్డిపి సీిఈ వసంత, ఎన్సిపిఇ కన్సల్టెంట్ దుర్గ రాజు, ఈఈ రేణుక, ఈఈ మహబూబ్ మియ, ఎస్ఎన్డిపి డిప్యూటీ ఈఈ వెంకటకిరణ్, ఈఈ గోపాల్, ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గతోపాటు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, సలీం, దయాకర్ యాదవ్, రంగు సతీష్‌గౌడ్, ప్రవీణ్ పటేల్, జాకీ బాబు, మహేష్ ముదిరాజ్, చలం, మహేష్ గంగపుత్ర, చిమ్మి, నాజేరుముదిరాజ్, ధరమ్, యూసుఫ్‌బాబా, రంగు ఉదరుగౌడ్, హైమద్, జమీల్, రాజ్ కుమార్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.