Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీకాతో ఇమ్యూనిటీ పెరుగుతుంది
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
- బోలక్‌పూర్‌లో వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ-అడిక్‌మెట్
రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహ మ్మారిని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. బోలక్పూర్ డివిజన్లోని బడి మసీద్ వద్ద కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్‌ను ఎమ్మెల్యే శనివారం ప్రారం భించి మాట్లాడారు. కరోనా కట్టడి అవ్వాలంటే వ్యాక్సి న్ ఒక్కటే మార్గమన్నారు. టీకా వల్ల ఇమ్యూనిటీ పవ ర్ పెరుగుతుందనీ, తద్వారా కరోనాని ఎదుర్కొనే శక్తి వస్తుందన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకో కుండా నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. అందుబాటులోనే వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ినట్టు తెలిపారు. ఏదైనా గుర్తింపు కార్డుతో సెంటర్లలో వ్యాక్సిన్ వేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్, యువ నాయకులు ముఠా జై సింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ మహ మ్మద్ అలీ, కార్యదర్శి వై.శ్రీనివాస్, మొహమ్మద్ అలీ, షరీఫ్ ఉద్దీన్, శంకర్‌గౌడ్, ముక్తావళి, భవానీ శంకర్ ఆలయం చైర్మన్ ఆర్.శ్రీనివాస్, రహీం, అక్బర్ అలీ, జబ్బార్, మక్బూల్, వాహిద్ అలీ, ఆరిఫ్, సునీల్, శివ కుమారి, ప్రవీణ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.