Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా 10 అంబులెన్స్ లను ఆరోగ్య వ్యవస్థల ప్రాజెక్ట్‌కు కరూర్ వైశ్యా బ్యాంకు విరాళంగా అందజేసింది. కరోనా సెకండ్‌వేవ్ కాలంలో బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాల మొత్తం విలువ రూ.4. 61 కోట్లు. కొవిడ్ మహమ్మారిపై యుద్ధంలో భాగంగా తమిళనాడు ఆరోగ్య వ్యవస్థల ప్రాజెక్ట్‌కు 10 అంబులెన్స్ లను ఈ బ్యాంకు విరాళంగా అందజేసింది. ఈ అంబుల ెన్స్లను రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ఉపశమన కార్యక్రమా లను అందించే రీతిలో అభివద్ధి చేశారు. వీటిలో రెండు అంబులెన్స్‌లను సాధారణ ప్రాంతాలలో నడిపితే, మిగిలి న 8 అంబులెన్స్‌లను కొండిపాంతాలలో నడుపుతారు. బ్యాంకు తమ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా రూ. 1.77 కోట్ల నిధులను వెచ్చించి ఈ అంబులెన్స్‌లను అందజేసింది. ఈ కార్యక్రమంలో కరూర్ వైశ్యాబ్యాంక్ తరపున కేవీఎస్ఎం జనరల్ మేనేజర్ సుధాకర్, డిప్యూ టీ జనరల్ మేనేజర్ ఆర్.గణేశన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వి.కష్ణన్ పాల్గొన్నారు. బ్యాంక్ సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బి.రమేష్‌బాబు మాట్లాడుతూ.. 'బాధ్యతాయుతమైన కార్పొరేట్ పౌరునిగా ఆరోగ్య సం రక్షణ, విద్య, పర్యావరణ సుస్ధిరత ప్రాజెక్టులకు కరూర్ వైశ్యాబ్యాంక్ మద్దతునందిస్తుంది. సుస్ధిర ప్రాజెక్టులకు మా విలువైన మద్దతును బ్యాంక్ కొనసాగిస్తుంది' అని అన్నారు.