Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రభుత్వ భూములను కాపాడేందుకు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. శనివారం కైసర్‌నగర్ వడ్డెర సంఘం నాయకులు ఆయనను గాజులరామారంలోని కూన సౌజన్య గార్డెన్లో కలిసి వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజులరా మారం డివిజన్ పరిధిలోని దేవేందర్‌నగర్, కైసర్‌నగర్ మధ్యలో గల సర్వే నంబర్ 342/1లోని భూ కబ్జాదా రులు తమ పనికి అడ్డంకులు సృష్టిస్తూ గుంతలు పూడ్చు తూ ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి ప్లాట్లు చేసి అమా యక ప్రజలకు విక్రయిస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆయన దృష్టికి తీసుకవచ్చారు. అనంతరం ఆయన మాట్లాడు తూ కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ప్రజల తరుపున అండగా నిలబడుతానన్నా రు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ కబ్జాదారులు జీవనం సాగి స్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం అధ్యక్షులు పి.గోపాల్, కార్యవర్గ సభ్యులు సెల్వరాజ్ దేవరాజ్, బాలకృష్ణ, అర్జున్, శ్యామ్, వడ్డెర సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.