Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి
- నల్లచట్టాలు రద్దుచేయాలని డిమాండ్
- రైతులపట్ల కేంద్రం వైఖరిపట్ల ఓయూలో నిరసన
నవతెలంగాణ-ఓయూ
కేంద్రంలో మోడీ పాలన మళ్లీ ఎమర్జెన్సీ రోజులను మరిపిస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్. మూర్తి అన్నారు. ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడి ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఢిల్లీలో ఏడు నెలలుగా మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలన్న డిమాండ్‌తో రైతులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా, కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్.ఎల్ మూర్తి మాట్లాడుతూ.. 46 సంవత్సరాల క్రితం ఇందిరా ప్రభుత్వం ఎమర్జెన్సీ తీసుకొచ్చిందని, అలాంటి ఎమర్జెన్సీ రోజులు మళ్లీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. నల్లచట్టాల రద్దుకోసం రైతులు నెలల తరబడి ఉద్యమిస్తున్నా మోడీ సర్కారులో చలనం లేదన్నారు. కార్పొరేట్ వర్గాలకు వ్యవసాయాన్ని అప్పజెప్పేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య, రాజ్యాంగా వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కరోనా కాలంలో ప్రజలు చావు బతుకుల్లో ఉంటే మోడీ మాత్రం ఎన్నికల రాజకీయాలు నడిపించారని, ఇప్పటికి కూడా సగం మందికి కూడా వ్యాక్సిన్ అందించలేకపోయారని విమర్శించారు. మరోవైపు ప్రశ్నించే వ్యక్తులను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని, మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను తిరోగమన స్థితిలోకి తీసుకు పోతున్నారని చెప్పారు. ఇలాంటి విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా యూని వర్సిటీలలో ఉన్న టీచింగ్ ఖాళీలను భర్తీ చేయాలని, పీహెచ్డీ విద్యార్థులకు రెగ్యులర్‌గా ఫెలోషిప్ ఇవ్వాలని కోరారు. మోడీ సర్కారు నియంతత్వ విధానాలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధర్మబిక్షం, నాయకులు రమేష్, భాస్కర్, అఖిల్, ప్రదీప్, నరేష్, చక్రి, బాలు, సతీష్, అశోక్ తేజ, పాల్గొన్నారు.