Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలోగల నాట్కో ప్రభుత్వ పాఠశాలలో టీసీలకోసం వచ్చిన పదవ తరగతి విద్యార్థులవద్ద ఒక్కొక్కరి నుంచి రెండువందల రూపాయలు వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జూబ్లీహిల్స్ జోన్ నాయకులు ఆరోపించారు. స్కూల్ యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా సోమవారం నిరసన వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని అడగ్గా అక్కడున్న టీచర్లు హెచ్ఎం వచ్చాక అడగండని సమాధానం ఇస్తున్నారని తెలిపారు. ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని డిప్యూటీ డీఈవో చిరంజీవి దష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రతీ స్టూడెంట్కు ఫ్రీగా టీసీ ఇస్తామని డిప్యూటీ డీఈవో హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సునీల్, విక్కీ, తులసీరామ్, దేవేందర్, ఆర్ సాయిరాం, లఖన్, సందీప్, ప్రజా సంఘాల నాయకులు సాయి శేష రావు, తదితరులు పాల్గొన్నారు.