Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి ఎం. అజరు బాబు
నవతెలంగాణ-ఓయూ
ఆర్ఎస్సీ స్పోర్ట్స్ గ్రౌండ్ ప్రయివేటీకరణ పై ఉద్యమిస్తామని సీపీఐ(ఎం) సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి ఎం.అజరు బాబు హెచ్చరించారు. సోమవారం సికింద్రాబాద్‌లో గ్రౌండ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. 120 ఎకరాలకు పైగా స్థలంలో ఆర్ఆర్సీ(రైల్వే రిక్రియేషన్ క్లబ్) దాదాపు 1911లో అధికారికంగా నిర్మించారని, ఎందరినో ఆరితేలిన ఆటగాళ్లు గా మార్చిన ఘనత ఈ గ్రౌండ్ కు ఉందని చెప్పారు. ఈ గ్రౌండ్ ఆసియాలో పేరుపొందిన ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అర్జున,పద్మశ్రీ అవార్డులు పొందినవారు ఇప్పటికీ ప్రాక్టీస్‌కు వస్తుంటారని చెప్పారు. ఎస్సీఆర్ (సౌత్ సెంట్రల్ రైల్వేలో) ఉన్న ఈ ఆర్ ఎస్ సి రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇలాంటిది ఇండియన్ రైల్వే లోనే ఎక్కడా లేదని, దీన్ని 2000లో ఆర్ఎస్సీ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా మార్చారని పేర్కొన్నారు. రోజుకు 1000 మంది 1500 వరకు వాకింగ్, వ్యాయామం, స్పోర్ట్స్ కోసం ఉపయోగించుకుంటున్నారని, ఇందులో క్రికెట్ గ్రౌండ్( ఇంటర్ నేషనల్ స్టాండర్డ్), అథ్లెటిక్ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, సింథటిక్ హాకీ స్టేడియం,హ్యాండ్ బాల్ కోర్ట్, కబడ్డీ కోర్ట్, కో- కో కోర్ట్, బాస్కెట్‌బాల్ అవుట్ డోర్ కోర్టు బాస్కెట్‌బాల్ ఇండోర్ కోర్ట్, బాక్సింగ్ హాల్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, బాడీ బిల్డింగ్ హాల్, వాలీబాల్ కోర్ట్-2, బీచ్ వాలీబాల్ కోర్టు, టేబుల్ టెన్నిస్ హాల్, టెన్నిస్ కోట్స్-6, బిల్యాడ్స్ హాల్, స్విమ్మింగ్ పూల్( ఇంటర్నేషనల్ స్టాండర్డ్), మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం(10,000 పీపుల్ సిట్టింగ్ కెపాసిటీ), షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఏ/సి జిమ్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, అన్నపూర్ణ మెస్, 400 రన్నింగ్ ట్రాక్, 1.8 కె.ఎం వాకింగ్ ట్రాక్ ఉన్నాయి అని అజరు పేర్కొన్నారు. వందల కోట్లు వెచ్చించి నేషనల్ లెవెల్లో అభివద్ధి జరిగిన ఆర్ఎస్ సి గ్రౌండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వచూపడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరికీ ఉపయోగపడుతున్న రైల్వే గ్రౌండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రయివేటు చెయ్యొద్దు అని డిమాండ్ చేశారు. లేనియెడల వామపక్షాలు, ప్రతిపక్షాలనుపెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని ఆందోళన చేపడతామని హెచ్చరించారు.