Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ పారిశ్రామిక ఏరియా పరిధిలోని భారత ప్రభుత్వం నైపుణ్య శిక్షణ వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ వారి సహకారంతో ఎలీప్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రెప్రేన్యూర్స్ అఫ్ ఇండియా (ఎలీప్)లో ఉపాధి ఉద్యోగం కొరకు 3 నెలల ఉచిత శిక్షణ కొరకు వత్తి విద్య కోర్సులు నిర్వహిస్తుండగా ఔత్సాహకుల లైన యువతుల, మహిళల అభ్యర్థుల నుంచి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఎలీప్ ఇండియా అధ్యక్షురాలు ు కె. రమాదేవి తెలిపారు. ఈఉచిత కోర్సుల్లో స్పెషలైజ్డ్ సూయింగ్ మిషన్ ఆపరేటర్ (అర్హత కనీసం 5వ తరగతి), ప్రొడక్షన్ /మిషన్ ఆపరేటర్ (పీఎంవో) అర్హత కనీసం 10 ప్లస్ 2/డిప్లొమా/డీ ఫార్మ/ ఐటీఐ/బీఎస్సీ కెమిస్ట్రీ), క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్రీ,(క్యూ సి సి) అర్హత అర్హత కనీసం బీఫార్మసీ, బి ఎస్ సి (కెమిస్ట్రీ), సోలార్ ప్యానల్ ఇన్ స్టోలేషన్ టెక్నీషియన్ అర్హత కనీసం పదో తరగతి/ఐటీఐ ఎలక్ట్రికల్/మెకానికల్/డిప్లొమా ల కోర్సులకు మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు శిక్షణ కాలంలో అప్రెంటిస్ ఈ లకు స్టైఫండ్ చెల్లించడం జరుగుతుందని, అలాగే కే.ఏ కోర్సుల శిక్షణ కాలం ముగిసిన తరువాత సర్టిఫికెట్లు ప్రధానం చేస్తారని ఎలీప్ ఇండియా స్కిల్ డైరెక్టర్ ఏ.మాధవి రాణి తెలిపారు. ఈ ఉచిత శిక్షణ సద్వినియోగ పరుచుకోని భవిష్యత్తులో ఉపాధి ఉద్యోగాలలో, తమకు తామే పారిశ్రామికవేత్తలు వెలుగొంది అవకాశం ఉందని తెలిపారు.