Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బీఎస్సీ అగ్రికల్చర్లో సీటు కావాలంటే ఖర్చవుతుంది వేలల్లో కాదు లక్షల్లో. అవును మీరు విన్నది నిజమే, లక్షల్లో డబ్బులు ఇస్తే డీఎస్సీ అగ్రి చదవాలనే కోరిక పూర్తవుతుంది. అది తెలుగు రాష్ట్రాల్లో కాదు ఓ మంచి పేరున్న బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ మహారాష్ట్రలో. ఈ తతంగమంతా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీసీపీి ఏఆర్, శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... అనంతపూర్ జిల్లాకు చెందిన అభినవ్ నాయక్ హైదరాబాద్ నగరంలోని యూసఫ్‌గూడలో కార్యాలయాన్ని ప్రారంభించి శ్రీనగర్ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ వద్ద కుటుంబంతో కలిసి ఉంటున్నారు. గత సంవత్సరం పెళ్లి చేసుకుని కుటుంబంతో కలిసి ఉంటున్న ఆయన మహారాష్ట్రలోని ఓ కాలేజీలో డిస్కంటిన్యూ చేసి తిరిగి హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు. యూసుఫ్‌గూడాలో ప్రారంభించిన తన కార్యాలయంలో అగ్రి సీట్లు ఎటువంటి రాతపరీక్ష లేకుండా తాను ఇప్పిస్తానని ప్రకటన విడుదల చేశారు. దీన్ని నమ్ముకున్న కొంతమంది యువత అతని కార్యాలయానికి వెళ్లి తమ వద్ద ఉన్న ధృవీకరణ పత్రాలను ఆయనకు అందించి లక్షల్లో డబ్బులు కట్టి నెలలు గడుస్తున్నా స్పందించకపోవడంతో సీటు కూడా రాకపోవడంతో అనుమానించిన కొందరు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇంతవరకు బాగానే ఉంది.. నాలుగు నెలల క్రితం తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తపరిచారు. 2 నెలల క్రితం మరో యువకుడు రూ.70వేలు చెల్లించామని, తనతో పాటు మరో ఇద్దరు కూడా చెల్లించారని ఫిర్యాదు అందినా కూడా పోలీసులు ముందస్తుగా అతనిపై చర్యలు తీసుకోకపోవడం వల్లే తమకు అన్యాయం జరిగిందని, ఒకవేళ అదుపులోకి తీసుకుంటే తమకు న్యాయం జరిగేదని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు దాదాపు పదకొండు మంది యువకలు, యువతులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇన్స్పెక్టర్ శివ చంద్రను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు తమ డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా సహకరించాలని కోరారు.తమకు న్యాయం జరగకపోతే హెచ్ఆర్సికి, వెళ్తామని తమ సర్టిఫికెట్లు తమకు అందజేయాలని కోరడంతో కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఎస్ఐ రామ్‌రెడ్డి ఇప్పటికి నాలుగుసార్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం అందించి. అతన్ని అదుపులోకి తీసుకోవడంతో ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మోసగాళ్ళను ఊరికే వదలకూడదు అని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు ఇటువంటి కార్యకలాపాలు చేయకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. తమకు జరిగిన అన్యాయం సమాజంలో ఎవరికి జరగకూడదని తమ తల్లిదండ్రులు కూలినాలి, వ్యవసాయ పనులు చేసి తమ చదువుల కొరకు డబ్బును చెల్లిస్తుంటే ఇటువంటి మోసపూరిత ప్రకటనలు చేస్తూ అన్యాయం చేస్తున్న వారికి సరైన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. కాగా పోలీసులు నిందితుడి నుండి 2 ల్యాప్‌టాప్‌లు ఒక సెల్‌ఫోన్ మరియు ఒక ట్యాబ్ ఫోన్ మహేంద్ర ఎక్స్యువి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.