Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
గ్రామాలలో వైకుంఠ దామాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీిఆర్ తగిన కృషిని అందిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మాల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఏదులాబాద్ మర్రిపెల్లిగూడ, మాదారం గ్రామంలో పూర్తి అయిన వైకుంఠ దామాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గ్రామాలను అందంగా తీర్చిదిద్ధేందుకు తగిన కృషిని అందిస్తున్నారని ఆయన ఆదేశాల మేరకు ప్రతి గ్రామాలలో వైకుంఠ దామాలు, డమ్పింగ్ యార్డ్లు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని నిధుల కొరతలు లేకుండా అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు టీిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తు అభివృద్ధి చేస్తుందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీి ఏనుగు.సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీి కర్రె.జంగమ్మ, ఎంపిడిఓ అరుణ, గ్రామ సర్పంచులు కాలేరు. సురేష్, చిలుగురి.మంగమ్మ సాయిలు, ఉపసర్పంచ్ ఉప్పు. లింగేశ్వర్ మాయా.నరేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కందుల కూమార్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంకం.రవి, సహకార బ్యాంకు డైరెక్టర్ చందుపట్లు ధర్మరెడ్డి, నాయకులు బండారి.శ్రీనివాస్‌గౌడ్, కొంతం.అంజిరెడ్డి, బొక్క .ప్రభాకర్‌రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.