Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని టీపీసీసీి నూతన అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులందరినీ కలుపుకొని టీపీసీసీి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. శాలు వాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు.
పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాల న్నారు. రానున్న ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కషి చేయాలని సూచించారు. టీిఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గడ్డం యాదగిరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాం రెడ్డి, కాప్రా సీనియర్ నాయకులు కాసుల పోచయ్య గౌడ్, నాయకులు కొత్త అంజి రెడ్డి, పెద్ది శ్రీనివాస్ గుప్తా, బిఎస్టి సాయి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత,్ నాని తదితరులు పాల్గొన్నారు.