Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జవహర్‌నగర్
వీధి వ్యాపారుల కోసం ప్రభుత్వ మోడ్రన్ స్ట్రీట్ వెండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినంద నీయమని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌లు అన్నారు. మంగళవారం చెన్నా పురం-ఆర్మీ డెంటల్ కళాశాల ప్రధాన రహదారిలో రూ.7,80,000వ్యయంతో చేపట్టే మోడ్రన్ స్ట్రీట్ వెండింగ్ కేంద్రానికి కమిషనర్ డాక్టర్ గోపితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్‌నగర్ కార్పొరేషన్లో మొదటి సారిగా వీధి వ్యాపారుల కోసం లక్షలు వెచ్చించి మోడ్రన్ స్ట్రీట్ వెండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుతాడి సాయి, గండి రామ్‌చందర్, కో-ఆప్షన్ సభ్యురాలు శోభారెడ్డి, నాయకులు సతీష్‌గౌడ్, శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.