Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తీపి, పులుపు, ఉప్పు, చేదు రుచులను గురించి అందరికీ తెలుసు. కానీ వీటన్నిటినీ మించిన రుచి... మామి గురించి ఎందరికి తెలుసు? ఎలాంటి వంటకం అయినా అంటే, భారతీయ కూరలు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేదంటే నూడుల్స్‌కు కూడా అద్భుతమైన మామి రుచి అందించాలంటే అజినో మోటో (ఎంఎస్‌జీ) జోడించాల్సిందే. వంటకాలకు అజినోమోటో జోడించడం ద్వారా రుచి మెరుగుపడ టంతో పాటుగా ఆరోగ్య పరంగానూ ప్రయోజనా లెన్నో ఉన్నాయి. మరీ ముఖ్యంగా వంటకాలలో ఉప్పు వినియోగం 30 శాతం వరకూ తగ్గించవచ్చు. తద్వా రా రక్తపోటు, హద్రోగ రోగులకు ప్రయోజనమూ కలుగుతుంది. వద్ధులలో ఆకలిని సైతం ఇది పెంచు తుంది. వంటకాల రుచిని పెంపొందించే మోనో సోడియం గ్లుటమేట్‌ను అజినో మోటో బ్రాండ్ పేరిట ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తుంది అజినోమోటో సంస్థ. జపాన్‌కు చెందిన ఈ సంస్థ సహజసిద్ధమైన చెరుకు, టాపియోకాల కిణ్వన ప్రక్రియ ద్వారా మోనోసోడియం గ్లుటమేట్ తయారు చేస్తుంది. దీనిలో ఎలాంటి రసాయనాలు జోడించరు. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలలో అజినోమోటో విస్తరించడమే కాదు, 130 సంవత్స రాలకు పైగా చరిత్ర కూడా ఈ బ్రాండ్‌కు ఉంది. అయితే ఇటీవలి కాలంలో చైనా ఉత్పత్తులతో పాటుగా స్థానిక తయారీ సంస్థలు అజినోమోటో పేరిట నకలీలను మార్కెట్లో వదులుతున్నారు. ఇలాంటి ఉత్పత్తుల పట్ల వినియోగదారులు ఆప్రమ ప్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అజినోమోటో ఇండియా అధికార ప్రతినిధి గోవింద బిశ్వాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ తల్లిపాలలో ఉండే గ్లూటమేట్ తమ అజినోమోటోలో ఉంటుందని, శిశువులు కూడా నిరభ్యంతరంగా తమ ఉత్పత్తులను వినియోగించవచ్చన్నారు. అజినోమోటోతో పాటుగా తాము ఫ్రైడ్‌రైస్‌ను అలంకరించుకునేందుకు హపి మా ఫ్రైడ్ రైస్ మిక్స్, ఇంటి వద్దనే రెస్టారెంట్ తరహా చికెన్‌కర్రీ వండుకోవడం కోసం హపిమా క్రిస్పీ ఫ్రై మిక్స్ మరియు ఏ అండ్ ఎం నూడిల్స్‌ను సైతం మార్కెట్లో విడుదల చేశామన్నారు. దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు విస్తరించబోతున్నామంటూ దీనికోసం తమ డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను సైతం గణ నీయంగా విస్తరించబోతున్నట్లు వెల్లడించారు.