Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 12 నుంచి కస్టమర్ డెలివరీలు ప్రారంభం
నవతెలంగాణ-ముంబయి/వరంగల్
ఇండియా 2.0 ప్రాజెక్టు-స్కోడా కుషాక్ కింద ఎంతోగానో ఎదురుచూస్తున్న ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభించి వాటి ధరను వెల్లడించడం ద్వారా భారత దేశంపై తన నిబద్ధతను మరోసారి బలంగా చాటు కుంది స్కోడా ఆటో. ఈ ఏడాది ప్రారంభంలో భారత దేశంలో తొలిసారి కనువిందు చేసిన కుషాక్ ఒక బలమైన ముద్రను సృష్టించుకుని భారతదేశంలో తయారై, భారతదేశం కోసం రూపుదిద్దుకుని సంపూర్ణ మైన సరికొత్త రూపంతో నిలుస్తోంది. దీనిలోని ప్రతీ అంగుళం అంతర్జాతీయ స్థాయిలో నిలుస్తుంది. ఒక దేశం-ఒక ధర సిద్ధాంతానికి అనుగుణంగా దేశవ్యాప్తం గా రూ.10.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో స్కోడా కుషాక్ అందుబాటులో ఉంటుంది. స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ 'కుషాక్ ఆవిష్కరణ స్కోడా ఆటో ఇండియాకు ఒక చారిత్రక ఘట్టం. దీని ద్వారా మేము డైనమిక్‌గా అంటే ఆటోమోటివ్ మార్కెట్లోని ఒక అద్భుతమైన సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నాం. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో అనే దానిపై దృష్టి పెట్టి భారతీయ మార్కెట్ అవసరాలకు సరిపోయేలా కుషాక్ ను డిజైన్ చేశాం. ఎంతో ఖ్యాతిగాంచిన ఎంక్యూబీ-ఎఓ-ఇన్ వేదికపై నిర్మించిన కుషాక్ చక్కని డిజైన్, దఢత్వం, అసామాన్యమైన తయారీ, భద్రత, విశాల మైన స్థలం, భవిష్యత్ అవసరాలకు తగిన అన్ని ఫీచర్ల సమాహారం. సర్వశ్రేష్ఠమైన పనితీరు, సామర్థ్యం, నాజూకుతనం, మెరుగైన ఔట్పుట్ అందించేందుకు ఈ రేంజ్ మొత్తానికి మేము అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన టీఎస్ఐ టెక్నాలజీని అందిస్తున్నాం. భారత దేశం కోసం సిద్ధమైన ప్రపంచశ్రేణి ఎస్‌యూవీతో దేశవ్యాప్తంగా ఉన్న సరికొత్త, ఎదుగుతున్న మార్కెట్లకు స్కోడా బ్రాండ్‌ను తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం' అన్నారు.