Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్
నవతెలంగాణ- సిటీబ్యూరో
దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ స్వయంగా ముందుకు రావడం సంతోషకరమని టీన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) అన్నారు. ఆదివారం అఖిలపక్ష సమావేశంలో రూ.1200 కోట్లతో దళిత సాధికారత పథకంతో పాటు ఇతర అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేక ధన్యవా దాలు తెలిపారు. దళితుల బాధ తెలిసిన దేశంలోని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ముజీబ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గృహకల్ప ఆవరణలో సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా సభ్యులు వరదరాజు, జె.బాలరాజ్, కె.ఆర్.రాజ్ కుమార్, కె.హరిబాబు, బి.సుజాత, కుర్రాడి శ్రీనివాస్, వైధిక్ శస్త్ర, ఈ.నరేష్ కుమార్, బి.శంకర్, నాయకులు సదానంద్, సామాజిక కార్యకర్తలు ఉస్మాన్ అలీ ఉస్మాని, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.