Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని
నవతెలంగాణ - జూబ్లీహిల్స్
జాతీయ వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడానికి అపోలో హాస్పిటల్స్ జూన్ 30వ తేది దేశవ్యాప్తంగా మెగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు అపోలో హాస్పిటల్స్ మంగళవారం ప్రకటించింది. దేశంలోని 50 నగరాల్లో విస్తరించి ఉన్న 200 అపోలో వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ భారీ ఎత్తున నిర్వహించబడుతుంది.
కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడానికి అపోలో అత్యాధునిక సాంకేతిక వేదిక అయినటువంటి అపోలో 24/7 యాప్‌ను ఉపయోగించి స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. తమకు సమీపంలోని అపోలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. వేచివుండే సమయాన్ని, తగ్గించి తమకు ఇష్టమైన స్లాట్‌ను ఎంపిక చేసుకోవడంలో యాప్ విని యోగదారుడికి రియల్-టైమ్ సమాచారాన్ని అంది స్తుంది. గరిష్ట సంఖ్యలో వ్యక్తులకు వ్యాక్సిన్లు అందిం చడం కోసం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు ఈ అపోలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించడం జరుగుతుంది.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభనకామినేని మాట్లాడుతూ 'ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ను అందుకునే వరకు ఏ ఒక్కరూ కూడా సురక్షితం కాదని మేము నమ్ముతున్నాం. గరిష్ట సంఖ్యలో వ్యక్తులు వ్యాక్సిన్‌ను అందుకోవడానికి ఈ డ్రైవ్ వీలు కల్పిస్తుంది. కోవిడ్ 3వ వేవ్‌ను తగ్గించడం లోనూ, మనం తిరిగి సాధారణ జీవితంలోకి అడుగు పెట్టడంలోనూ వ్యాక్సినేషన్ అనేది అత్యుత్తమమైన రక్షణ అని చెప్పవచ్చు' అని అన్నారు.