Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పాలకవర్గం మొదటి జనరల్ బాడీ సమాశాన్ని మంగళవారం వర్చ్యువల్‌గా నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు సహా మొత్తం 156 మంది పాల్గొన్నారు. ముందుగా లింగోజిగుడ కార్పొరేటర్‌గా ఎన్నికైనా ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డితో మేయర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనం తరం మొదటగా బడ్జెట్‌పై స్పెషల్ మీటింగ్ నిర్వహించారు. బడ్జెట్‌పై టీఆర్ఎస్, మజ్లీస్, బీజేపీ సభ్యులు మాట్లాడారు. ఈ వర్చువల్ స మావేశానికి కమిషనర్ లోకేష్‌కుమార్, జీహెచ ్ఎంసీ వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజర య్యారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన ప్రారంభ ఉపన్యాసం అనంత రం 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. చర్చల అనంతరం బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం గతంలో జరిగి న స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను ఈ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదిస్తున్నట్టు మేయర్ లాంఛనంగా ప్రకటిం చారు. అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్ర మంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు వివిధ అంశాలపై వేసిన 14 ప్రశ్నలపై విస్త్రృత స్థాయిలో చర్చలు జరిగాయి. సభ్యులు లేవనెత్తిన ఈ ప్రశ్నలకు కమిషనర్ పూర్తిస్థాయి సమాధానం ఇచ్చారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వ హణపై కార్పొరేటర్లు సున్నం రాజ్‌మోహన్, మహ్మద్ మాజీద్ హుస్సేన్, శంకర్ యాదవ్ ప్ర శ్నలు అడిగారు. నగరంలో జరుగుతున్న నాలాల పూడిక పనులపై రాజేష్ జైస్వాల్, హరితహా రంపై సింగిరెడ్డి శిరీశారెడ్డి, నల్ల చెరువు బ్యూటిప ˜ికేషన్ పనులపై ఎం.రజిత, పటేల్‌కుంట చెరువు బ్యూటిఫికేషన్‌పై శాంతి సాయిజన్ శేఖర్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. వర్షాకాల ప్రణాళికపై వంగ మధుసూదన్‌రెడ్డి, నగరంలో గ్రేవ్ యార్డుల అభివృద్దిపై బన్నాల గీతా ప్రవీణ్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. బాలానగర్‌లోని కెమికల్ నాలాపై రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఆవుల రవీ ందర్‌రెడ్డి, నగరంలో జరుగుతున్న వివిధ అభి వృద్ది పనులపై జగదీశ్వర్‌గౌడ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మొట్టమొదటగా నిర్వహి ంచిన జనరల్ బాడీ సమావేశాన్ని విజయవం తంగా నిర్వహించడం పట్ల పలువురు అధికారు లు, ప్రజాప్రతినిధులు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మిని అభినందించారు.
ఈ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ నగర ప్రాంతాల్లో మరింత మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం జులై 1వ తేదీ నుంచి పది రోజుల పాటు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు మేయర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వార్షిక బడ్జెట్లో ఈ పట్టణ ప్రగతి కార్య క్రమానికి రూ.936 కోట్లు కేటాయించామని తెలి పారు. పది రోజుల కార్యక్రమంలో వార్డుల వారి గా అభివృద్ది కార్యక్రమాల సమీక్ష, సీజనల్ వ్యా ధుల నివారణకు పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు, నీటి నిల్వల తొలగింపు, దోమల నివారణ మందుల స్ప్రేయింగ్, నగరంలో చెత్త తొలగింపు, రహదారుల వెంట పిచ్చి మొక్కల తొలగింపు, రోడ్ల వెంట భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను చేప ట్టనున్నట్టు వివరించారు. జంట నగరాల పరిధి లోని వివిధ నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాల (పూడిక) తొలగింపు కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికలను రూపొందించిందనీ, ఈ ఏడాది రూ.45 కోట్ల ఖర్చుతో 884.15 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులు జనవ రిలో ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికిగాను ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నగరంలో చెత్త సేకరణను మరింత సమర్దవంతంగా చేసేందుకు 90 మినీ ట్రాన్స ఫర్ పాయింట్లను ఏర్పాటు చేశామని అన్నారు. జీహెచ్ఎంసీలో శానిటేషన్ వర్కర్ల వేతనాలను రూ.14,500 నుంచి రూ.17,500 లకు పెంచా మనీ, దీంతో 18,550 శానిటేషన్ వర్కర్లు, 948 ఎస్ఎఫ్ఏలు, ఎంటమాలజీ వర్కర్లకు లబ్ది చేకూరినట్టు అయిందని తెలిపారు. రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్‌ను 33 శాతం పెంచాలనే ఆశయ ంతో ప్రారంభించిన తెలంగాణకు హరితహారం లో 2016 నుంచి 2020 వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 2.77 కోట్ల మొక్కలను నాటడం, ఉచి తంగా పంపిణీ చేశామని తెలిపారు. ప్రస్తుత 2021లో హరితహారంలో భాగంగా కోటిన్నర మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్లో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది అందించిన సేవలను మేయర్ ఈ సందర్భంగా అభినందించారు.