Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) అధ్యక్షులు
ఉజ్జిని రత్నాకర్ రావు
నవతెలంగాణ-నారాయణగూడ
రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు పాలక మండలిని వెంటనే నియమించాలని తెలంగాణ రాష్ట్ర భవ న నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) అధ్యక్షులు ఉజ్జి ని రత్నాకర్‌రావు డిమాండ్ చేశారు. కార్మిక సంఘం ఆధ్వ ర్యంలో మంగళవారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూ సీ రాష్ట్ర కార్యాలయంలో కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రత్నాకర్‌రావు మాట్లాడు తూ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు పాలక మండలి కాల పరిమితి ముగిసి మూడేండ్లు అవుతున్నప్ప టికీ నూతన పాలక మండలిని నియమించకపోవడం దురదృష్టకరమన్నారు. కార్మిక ప్రతినిధులతో వెంటనే పాల కమండలిని నియమించాలని డిమాండ్ చేశారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో వేలాది మంది ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు వీధిన పడ్డారనీ, వందల సంఖ్య లో కరోనాతో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. నిర్మాణ రంగంలో ఉపయోగించే స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుక, రాయి తదితర మెటీరియల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. నిర్మాణ పనుల నుంచి సెస్సును వసూలు చేసేందుకు తగిన యం త్రాంగాన్ని నియమించాలనీ, లేబర్ డిపార్ట్మెంట్లో ఖాళీ లను భర్తీ చేయాలనీ, నూతనంగా ఏర్పడిన కొత్త జిల్లాల్లో డీసీఎల్ను లేదా కనీసం ఏసీఎల్సీను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ప్రవీణ్ కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులు గన్నారపు రమేష్, ఉప ప్రధాన కార్యదర్శి గాదె లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఎం.రామ్మో హన్, కార్యదర్శులు మల్లేష్, కోటేశ్వరరావు, కమతం యాద గిరి, కె.వెంకటేశ్వర్లు, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.