Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-ఘట్కేసర్
మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తగిన కృషిని అందిస్తుకన్నారని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మాల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సి పాల్టీ పరిధిలో మంగళవారం 1వ వార్డులో పైపులైన్ 2వ వార్డులో కమ్యునిటి హాల్ పార్కు, 18వ వార్డులో సీసీ ిరోడ్లు, 16 సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ పైపులైన్, 11వ వార్డులో డ్రయినేజీ వాటర్ పైపులైన్, 14వ వార్డులో సీసీ రోడ్లు రూ. 77 లక్షలా 50 వేల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం హారతహారంలో భాగంగా మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తగిన కృషిని అందిస్తున్నారని తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మెన్ పలుగుల మాదవ్‌రెడ్డి, కమిషనర్ వసంత, సహకార బ్యాంక్ చైర్మెన్ సింగిరెడ్డి రామ్‌రెడ్డి, రైతు సయన్వయ సమితి అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, ఘట్కేసర్ టీఆర్ఎస్ బండారి శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధా కృష్ణ, కౌన్సిలర్లు వెంకట్‌రెడ్డి, రమాదేవి, బొక్క.సంగీత, బండారి ఆంజనేలు, కడుపోల్ల మల్లేష్, బండారి వసంత, బేతాల్ నర్సింగారావు, కుతాడి రవీందర్, కో-ఆప్షన్ సభ్యులు పల్లె అరుణ, బొట్లు అరుణ, బొక్క సురేందర్‌రెడ్డి, శౌకత్మీయా, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.