Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆధునిక పరికరాలను వినియోగిస్తూ నిరుపేద ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందిస్తున్నా మని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఆధునిక సాంకేతక పరిజ్ఞానం వినియోగించి అత్యల్ప ఉష్టోగ్రతల వద్దే తక్కువ సమయంలోనే వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేసే పరికరాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి సారిగా అందుబాటులోనికి తె చ్చిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్లో ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రోగులకు అత్యంత సురక్షిత, భద్రతతో కూడిన ఆధునిక చికిత్స అందించా లనే సంస్థ లక్ష్యానికి అనుగుణంగానే ఈ అత్యాధునిక స్టెరిలైజేషన్ యంత్రాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి సారి గా హాస్పిటల్లో ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుత కరోనా కాలంలో నూటికి నూరు శాతం ఇన్ఫెక్షన్లను నిరోధించే ఈ యంత్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలి పారు. అంతేగాకుండా ఈ యంత్రం కారణంగా పునర్వి నియోగం చేయాల్సిన వైద్య పరికములు, సాధనములు అతి తక్కువ సమయంలోనే అందుబాటులోనికి వస్తా యనీ, తద్వారా ఎక్కువ మంది రోగులకు వీటిని ఆలస్యం లేకుండా వినియోగించే వీలుంటుందని ఆయన చెప్పా రు. ఈ కార్యక్రమంలో జెయస్ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, ఎం. భరత్, ట్రస్టు బోర్డు సభ్యులు, డా.ఆర్ వి ప్రభాకర రావు, రవికుమార్, డా.టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, డా.ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపరింటెం డెంట్ డా.కల్పనా రఘునాథ్, ఆసోసియేట్ డైరెక్టర్ డా. బసంత్ కుమార్, ఛీఫ్ అనస్థీషియాలజిస్టు, రామాంజ నేయగౌడ్, విభాగాధిపతి, బయోమెడికల్ ఇంజినీర్లు వెంకటేష్, రమ్యల ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.