Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన జగద్గిరిగుట్ట డివిజన్ సంజరుపూరి కాలనీ, పాపిరెడ్డినగర్లలో నిర్వహించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం చెత్త చెదారాలను తొలగించారు. అదే విధంగా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రుక్మిణి ఎస్టెట్‌లో, సూరారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్, సుభాష్‌నగర్ డివిజన్ పూరారం కాలనీ పార్కులలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, నాయకులు జి.సురేష్‌రెడ్డి, డిసి రవిందర్‌కుమార్, మంగతాయారు, ఈఈ కృష్ణచైతన్య, డీఈ పాపమ్మ, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని పట్వారీ ఎంక్లేవ్ కాలనీ పార్కులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బి.విజరుశేఖర్గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఈ ఆశ, స్థానిక నాయకులు మద్దూనూరి వెంకటేష్, లక్ష్మణ్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.
చింతల్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కమ్యూనిటీ హాల్ గ్రౌండ్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రశీదాబేగం రఫీ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ఏఈ సంపత్, ఎస్ఎస్ దుర్గారావు, ఎస్ఎఫ్ఎy జీవం, స్థానిక నాయకులు , కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.