Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్‌చారి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గత కొన్నేళ్లుగా కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్ డివిజన్లోని జీనియస్ పాఠశాల యజమాన్యం అనుమతులు లేకుండా తప్పుడు ధృవ పత్రాలను సృష్టించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్‌చారి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోల్ల జాన్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల అవరణంలో పలు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఎలాంటి అనుమతులు లేకుండా తప్పుడు ధృవ పత్రాలతో పోందిన ఈటీఆర్ పర్మిషన్ గురించి జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలులేకుండా సదరు పాఠశాలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని మండి పడ్డారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం జూలై 1న పాఠశాల పున:ప్రారంభించిన నేపథ్యంలో నూతన అడ్మిషన్లు , పదో తరగతి రెన్యూవల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులను పాఠశాలకు రప్పిస్తున్న విషయం తెలుసుకున్న సదరు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన నిర్వహించి పాఠశాలకు తాళాలు వేశారు. విద్యాశాఖ అధికారులు సత్వరమే చర్యలు తీసుకోని విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు