Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
మత్స్య కారుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ముళ్ళకత్వ చెరువు వద్ద కోనేటిలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత ప్రాజెక్టులో నీరు నిండుకుండలా మత్స్య సంపద పెరిగిందన్నారు. తెలంగాణలో మత్స్య సంపద అభివృద్ధి చెంది రైతులకు ఆదాయ వనరుగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని సదుపాయాలతో చేపల మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం
అన్ని సదుపాయాలతో చేపల మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కేపీహెచ్‌బీ డివిజన్లో ఏర్పాటు చేసిన చేపల మార్కెట్‌ను స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేపీహెచ్బీలో చేపలు అమ్ముకునే వారికి అన్ని సౌకర్యాలతో నిర్మించామన్నారు. త్వరలోనే రైతు బజార్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
అత్యాధునిక సదుపాయాలతో శ్మశాన వాటికల నిర్మాణం
అత్యాధునిక సదుపాయాలతో అన్ని వర్గాల శ్మశాన వాటికలను నిర్మిస్తామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కేపీహెచ్‌బీ డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న ముస్లీం శ్మశాన వాటిక పనులను స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకరావాలన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, ముస్లీం మైనార్టీ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.