Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంతఖర్చయినా భరించి, ఆకుపచ్చరాష్ట్రంగా మారుస్తాం
- కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- పీర్జాదిగూడ, పోచారం మున్సిపాల్టీలో పర్యటన
నవతెలంగాణ-బోడుప్పల్
హరిత హారంలో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి మొక్కలు నాటుతామని, ఎంత ఖర్చైనా భరించి, రాష్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి నిర్వహించిన మూడో విడత హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా గురువారం మేడిపల్లిలోని రాచకొండ కమిషనరేట్ ప్రాంగణం, కమలానగర్‌లలో జక్కా వెంకట్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం నిర్దేశించిన దానికి మించి మొక్కలు నాటినమని, ఈ ఏడు కూడా లక్ష్యాన్ని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికీ, రోడ్డుకూ ఇరువైపులా మొక్కలు పెంచి, అవి చెట్లుగా మారేంతవరకూ సంరక్షించాలన్నారు. చెట్లుంటేనే క్షేమమని, లేదంటే క్షామమని అన్నారు. గాలి, నీరు అన్నింటికీ చెట్లే ఆధారమని, అందుకే మఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం పథకం తీసుకువచ్చి తెలంగాణను ఆకుపచ్చని తెలంగాణగా రూపొందిస్తున్నారన్నారని అన్నారు.
పీర్జాదిగూడ ఆదర్శంగా నిలిచింది
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి మాట్లాడుతూ.. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో గత సంవత్సరం చేపట్టిన పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను, మొక్కల సంరక్షణకు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. గ్రీన్ బడ్జెట్‌కు నూతన మున్సిపల్ చట్టం ద్వారా కేటాయించాల్సిన నిధులకు మించి ఖర్చు చేసి పార్కులు అభివద్ధి పరచడం, ఇంటగ్రేటెడ్ డంపింగ్ యార్డు, గ్రేవియార్డ్ల అభివద్ధి కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమాల్లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేషభగవత్, అడిషనల్ కమిషనర్ జాన్ శ్యామ్సన్, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, పట్టణప్రగతి కార్యక్రమ ప్రత్యేకాధికారి లింగస్వామి, మేడిపల్లి తహసీల్దార్ అనిత, పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్: పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ 5వ వార్డు పరిధిలోని సాయినగర్ కాలనీలో చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి కలెక్టర్ శ్వేత మహంతితో కలిసి ఎల్ఆర్ఎస్ నిధులు రూ. 15లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈసందర్భంగా అన్నోజిగూడ రెవెన్యూ పరిధిలోని 3జ1 సర్వే నంబర్లో మహిళలకు డ్వాక్రాభవనం, యువతకు క్రీడా మైదానంకు స్థలం కేటాయించాలని చైర్మెన్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యామ్ సన్, తహసీల్దార్ విజయలక్ష్మి, వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, ఏఈ నరేష్ కుమార్, కౌన్సిలర్లు గొంగళ్ల మహేష్, సింగిరెడ్డి సాయిరెడ్డి, మెట్టు బాల్‌రెడ్డి, బెజ్జంకి హరిప్రసాద్ రావు, బాలగోని వెంకటేష్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ ఆక్రమ్ ఆలీ, దాసరి శంకర్, మేనేజర్ నర్సింలు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ సుకృతా రెడ్డి, నాయకులు బోయపల్లి సత్తిరెడ్డి, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, నల్లవెల్లి శేఖర్, కొమ్ముల ప్రశాంత్, బద్దం జగన్ మోహన్ రెడ్డి, ఆకిటి బాల్‌రెడ్డి, చిన్న నర్సింహ్మ గౌడ్, నర్రి శ్రీశైలం, మొటుపల్లి శ్రీనివాస్, సింగిరెడ్డి నర్సింహ్మరెడ్డి, మల్లెష్, నర్రి కాశయ్య, మిసాల రాజేష్, జి.శేఖర్, వివిధ కాలనీ ప్రజలు, మహిళా సంఘాల నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.