Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పట్టణ ప్రగతిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఈనాడు కాలనీలో డీసీ ప్రశాంతి, ఏఎంఓహెచ్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని కాలనీలు, బస్తీలను ఆదర్శవంతంగా తీర్చిద్దిదాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీరాములు, ఎంటమాలజీ ఏఈ ఉషారాణి, సూపర్వైజర్ నరేష్, ఎస్ఆర్పీ నాయక్, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్‌యాదవ్, నాయకులు గొట్టి ముక్కల పెద్ద భాస్కర్‌రావు, నాయినేని చంద్రకాంత్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రమోహన్ సాగర్, భుజంగరావు, అశోక్‌రెడ్డి, రవీందర్రావు, మోజేస్, రాము, చంద్రశేఖర్, రమణారెడ్డి, మురళీ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.