Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
నగరంలో పాన్‌షాపు నిర్వాహకులపై పోలీసుల దాడులు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ జంటనగరాల పాన్‌షాపు నిర్వాహకులు అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాన్ మసాలా ఉత్పత్తులపై ఓవైపు తయారీదారులు ప్రసార మాధ్యమాల్లో, బస్సులపై ఎక్కడపడితే అక్కడ బహిరంగ ప్రకటనలు చేస్తుంటే వారి నుంచి ప్రభుత్వం లీగల్ టాక్స్ వసూలు చేస్తూంటే పాన్ షాప్ నిర్వాహకులు మాత్రం జైలు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నామన్నారు. షాపుల నిర్వాహకులపై పోలీసుల వేధింపులు ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంతోష్ కాజా, సాదిక్, మహేష్, యువరాజు, ఇస్మాయిల్, సత్యనారాయణ, రఫీక్, బాలరాజు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.