Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
నాలుగేండ్లుగా రేకుల షెడ్డులో కొనసాగుతున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగేండ్లుగా రేకుల షెడ్డులో కొనసాగిన పోలీస్ స్టేషన్ తెలంగాణలో నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ గా నిర్మాణం కాబోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం ముందుకు వచ్చిన రామోజీ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రెండు కోట్ల రూపాయలతో నూతన పీఎస్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ సమీపంలోని ఓ ప్రయివేటు కన్వెన్షన్ సెంటర్ల్లో దాతల సహకారంతో వివిధ గ్రామాలలో ఏర్పాటు చేయనున్న 110 సీసీ కెమెరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ తీగల అనిత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ స్వామి, ఎస్సైలు జానకిరాము రెడ్డి, వీరభద్రం, ఎంపీపీ బుర్ర రేఖ, సహకార సంఘం చైర్మెన్ విఠల్ రెడ్డి, సర్పంచ్‌లు చెరువు కిరణ్ కుమార్, కరిమెల వెంకటేష్, మూల మహేష్, టి. మల్లేష్, అంతటి యశోద ఊషయ్య, జక్క లావణ్య పాపిరెడ్డి, లతశ్రీ గౌరీ శంకర్ చారి, వనజ శ్రీనివాస్ రెడ్డి, కవాడి శ్రీనివాస్ రెడ్డి, పారంద సంతోష కిషన్, ఎంపీటీసీ గ్యార బాల లింగస్వామి, ఉపసర్పంచ్ ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.