Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకోసం విరివిగా మొక్కలను నాటాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం ఖైరతాబాద్ నియోజక వర్గ పరిధిలోని దుర్గానగర్పార్క్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగం గా స్థానిక శాసన సభ్యులు దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, పలు శాఖల అధికారులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గానగర్ కాలనీ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణం విశ్వనగరంగా అభివద్ధి పథంలోకి పయనిస్తున్న హైదరాబాద్ నగర ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో, పచ్చదనం మద్య ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీలు, బస్తీలు, రహదారులను శుభ్రంగా ఉంచడం, దోమల నివారణకు పాగింగ్ చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం నిర్వహించే అభివద్ధి కార్యక్రమాలకు ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరం అన్ని రంగాలలో ఎంతో వేగంగా అభివద్ధి చెందిందని వివరించారు. ప్రధానంగా పెరుగుతున్న ట్రాపిక్ రద్దీకి అనుగుణంగా నూతన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, ప్రయాణ దూరాభారం తగ్గించే విధంగా లింక్‌రోడ్ల నిర్మాణం, పుట్ పాత్ల నిర్మాణం, పార్క్‌ల అభివద్ధి వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కాలనీలు, బస్తీల అసోసియేషన్లు తమ బాధ్యతగా భావించి పారిశుధ్య నిర్వహణ, పార్క్‌ల అభివద్ధికి కషి చేయాలని, అధికారులకు సహకరించాలని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్‌కమిషనర్ ప్రావిణ్య, హరితహారం స్పెషల్ ఆఫీసర్ కష్ణ తదితరులు పాల్గొన్నారు.