Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశించిన విధంగా రాష్ట్రాన్ని హరితవనంగా మార్చే క్రమంలో అందరూ హరితహారంలో పాలుపంచుకుంటూ మొక్కలు నాటడం శుభపరిణామమని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు అన్నారు.
ఏడవ విడుత హరితహారంలో భాగంగా జేటీసీలు పాండురంగ నాయక్, సి.రమేష్‌లతో కలిసి రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో, ఆ తర్వాత నాగోల్ డీటీటీలో సిబ్బందితో కలిసి ఆయన గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని హరితవ నంగా తీర్చిదిద్దేందుకు పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం జరుగుతోందని, హరిత హారం ద్వారా రాష్ట్రమంతటా పచ్చదనం పరచుకోనుందని తెలిపారు. ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుం దని, ఈ మేరకు ప్రభుత్వ స్థలాల్లో, కార్యాలయాల్లో అనువైన ఖాళీ స్థలాల్లోనూ విరివిగా మొక్కలు నాటే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ప్రతిచోట చెట్లు నాటడం ద్వారా నగరంలో కాలుష్యాన్ని నివారించవచ్చని, ఇదే స్ఫూÛర్తితో ప్రతి ఒక్కరూ వారి వారి ప్రదేశాల్లో మొక్కలు నాటి.. వాటి సంరక్షణను అందరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని సూచించారు.