Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి, హరిత హారం కార్యక్రమం ద్వారా డివిజన్ రూపురేఖలు మారుస్తానని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28 వ డివిజన్ కార్పోరేటర్ చీరాల నర్సింహ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని శ్రీ సాయి ఎన్ క్లేవ్ లో జరిగిన సమావేశానికి మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీగౌడ్, ఇన్చార్జ్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానన్నారు. త్వరలోనే డివిజన్ లో ఉన్న డ్రయినేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ, అధికారులు శ్రీ సాయిఎన్ క్లేవ్ కాలనీ ప్రెసిడెంట్ అంజయ్య, ప్రధానకార్యదర్శి కృష్ణమూర్తి, ఏ .సత్యనారాయణ , పెంటా రెడ్డి కాలనీ అధ్యక్షుడు మధుసూదన్, కార్యదర్శి కనకయ్య, వెస్ట్ మారుతీ నగర్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్, కార్యదర్శి ఆకుల యాదగిరి, అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి చీరాల జంగయ్య, డివిజన్ అధ్యక్షుడు మైసగల్ల బాలయ్య, టీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు భార్గవి, చీరాల అనిత, సుగుణ, శివప్రసాద్, వెంకటేశ్వర్, జీసీ రెడ్డి, ఇంద్రారెడ్డి, శ్రీహరి, చంద్రయ్య, లక్ష్మమ్మ, ఇంద్రమ్మ పాల్గొన్నార