Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల అధికారులు, నాయకులతో సమీక్ష
నవతెలంగాణ-మలక్‌పేట్/ఎల్బీనగర్
ఆర్కెపురం, సరూర్‌నగర్ డివిజన్ల పరిధిలో మం చినీటి సరఫరాను కూడా మెరుగుపర్చాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశా లు జారీ చేశారు. శుక్రవారం ఆర్కెపురం, సరూర్‌నగర్ డివిజన్ నాయకులు, అధికారులతో మంచి నీటి సర ఫరా తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలపై భారం పడకుండా ఉచితంగా నాణ్యతతో కూడిన నీటిని సర ఫరా చేస్తున్నామనీ, అవసరమైన చోట్ల పైపు లైన్ల సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలిపారు. పాత లైన్ల స్థానంలో కొత్త పైపులైన్లను, మరికొన్ని చోట్ల మరమ్మ తులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్కేపురం డివి జన్ పరిధిలో ఎన్టీఆర్ నగర్, గ్రీన్‌హిల్స్ కాలనీలు, సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో డాక్టర్స్ కాలనీ, వెంక టేశ్వరనగర్ కాలనీ, జింకలబావి, క్రాంతినగర్ కాలనీ, గణేష్ మండపం, చేరుకుతోట కాలనీ, పోచమ్మ బాగ్ కాలనీ, శ్రీనివాస్ కాలనీ, భగత్ సింగ్‌నగర్, అంబే ద్కర్ నగర్ పరిధిలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పైప్ లైన్ల సామర్థ్యాన్ని పెంచాలని అధి కారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతిపాదనలను రూపొం దిస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులను మంజూ రు చేయిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో నియో జకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, ఆర్కెపురం డివిజన్ అధ్యక్షులు ఆరవింద్ శర్మ, సరూర్‌నగర్ డివి జన్ అధ్యక్షులు ఆకుల ఆరవింద్, సాజిద్, జలమండలి జనరల్ మేనేజర్ వినోద్ భార్గవ్, డీజీఎం సరిత, మేనే జర్లు లెనిన్, రామకృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయ కులు పారుపల్లి దయాకర్‌రెడ్డి, దర్పల్లి అశోక్. మహే ందర్ యాదవ్, కేశవరెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు.