Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అప్పటికప్పుడు సమస్యల ను గుర్తించి పనులకు నిధులను మంజూరు చేసే విధం గా చర్యలు తీసుకోవాలని లింగోజిగూడ డివిజన్ కార్పొ రేటర్ ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం పారిశుధ్య సమస్యలు మా త్రమే పరిష్కారమవుతున్నాయన్నారు. రూ.లక్ష లోపు ఉన్న పనులన్నిటికీ టీం లీడర్‌గా వ్యవహరిస్తున్న అధికా రులకు పనులకు నిధులు మంజూరు చేసే అధికారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం రోడ్ల వెంట ఉన్న పార్కులో ఉన్న మట్టిని తొలగించడం తప్పా అభి వృద్ధి పనులు చేపట్టే లేకపోతున్నారని తెలిపారు. విద్యు త్ కేబుల్ వేయాలన్న పై అధికారుల అనుమతి కావా లని చెబుతున్నారనీ, అలా కాకుండా సమస్యను గుర్తిం చిన చోటే నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేయాలని కోరారు. ట్రాక్టర్లు, జేసీబీ, డోజర్ల తోపాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక ఎగ్జిబిషన్ల అగుపడుతున్నారనీ, అలా కాకుండా పనిచేసే విధంగా చొరవ చూపాలన్నారు. పట్టణ ప్రగతికి రూ.950 కోట్లు మంజూరు చేశారనీ, నిధులను వివిధ డివిజన్లలో గుర్తిం చిన పనులకు కేటాయించి తక్షణమే పనులు చేపట్టాల న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.