Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
ప్రతి ఏడాది లాగే ఈ సారీ ఆషాడమాసం బోనాల పండుగ సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మ వారికి బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ కార్యక్ర మంలో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. ఈనెల 18న ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరగబోయే ఉత్సవాలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి కమిటీ సభ్యులు విజయవాడ బయలు దేరారు. శ్రీ కనక దుర్గ అమ్మవారి, మల్లేశ్వరస్వామి ఆలయ ఈవో బ్రమ రాంబ, ఆలయ కమిటీ చైర్మన్ పూడిపల్లి స్వామి నాయు డు, విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు, రాష్ట్ర సాంస్కతికశాఖ డైరెక్టర్ మల్లికార్జున రావుకు వినతిపత్రం అందజేసి 18న జరగబోయే బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగేటట్టు చూడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకోవలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాల య కమిటీ చైర్మన్ బల్వంత్ యాదవ్, కార్యదర్శి మధు యాదవ్, మాజీ చైర్మన్ గాజుల అంజయ్య, హంసరాజ్, ఉప్పుగూడ మహంకాళి ఆలయ చైర్మన్ జనగామ మధు సూదన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.