Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నాటిన మొక్కలను ప్రతి ఒక్కరు బాధ్యతగా సంరక్షించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని బీరప్పనగర్‌లో కార్పొరేటర్ కొలుకుల జగన్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ పాపిరెడ్డినగర్, బీరప్పనగర్, దేవమ్మ బస్తీలలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో డీసీ రవీందర్‌కుమార్, జలమండలి జీఎం శ్రీధర్‌రెడ్డి, ఏఈ సతీష్, జలమండలి మేనేజర్ అంకిత్, వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్, నాయకులు మల్లేష్‌గౌడ్, కృష్ణగౌడ్, వేణుయాదవ్, ఎత్తరి మారయ్య, రుద్ర అశోక్, హజ్రత్‌అలీ, మహేందర్, మనోజ్, బసవశ్వర్, కుమార్, విఠల్ ముదిరాజ్, పాపిరెడ్డి, శ్రీనివాస్, వెంకటేష్, బాలరాజు, వీరాచారి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
-భావితరాలకు మొక్కలే జీవనాధారమని అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రాగా టూల్స్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ నరేందర్‌నాయక్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రంగారెడ్డినగర్ డివిజన్ పట్వారీ ఎంక్లేవ్ పార్కులో స్థానిక సంక్షేమ సంఘం నాయకులతో కలిసి మొక్కలు నాటారు.కార్యక్రమంలో అధ్యక్షులు మద్దునూరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌గుప్త, టీఆర్ఎస్ నాయకులు ఎర్వ శంకరయ్య, మహిళా నాయకులు రాణి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
-చింతల్ డివిజన్ పరిధిలోని దుర్గయ్యనగర్‌లో స్థానిక కార్పొరేటర్ రశీదాబేగం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీ రవీందర్‌కుమార్, చింతల్ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్‌రఫీ, కాలనీ అధ్యక్షులు శ్రీశైలంయాదవ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని నందానగర్‌లో శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ బి.విజరుశేఖర్గౌడ్లు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం బస్తీలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ నరేందర్, ఈఈ కృష్ణచైతన్య, ఏఈ ఆశ, ఆర్టికల్చర్ విభాగం కిరణ్, జలమండలి ఏఈ పూజిత, రిజ్వన్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.