Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ఐడీఎల్ చెరువు వద్ద కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని భరత్‌నగర్ కాలనీలో స్థానిక నాయకులు, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఆయన చెత్తను, మట్టి కుప్పలను తొలగించారు. కార్యక్రమంలో ఎస్ఆర్పీ సత్యనారాయణ, ఎస్ఎఫ్ఎలు, జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎలక్ట్రికల్ లైన్మెన్ రమేష్, డివిజన్ గౌరవ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, రాగ ప్రసాద్, నాయకులు కృష్ణంరాజు, కుమారస్వామి, మహేష్, వెంకటేష్, శ్రీహరి, ఎల్లారెడ్డి, ప్రసాద్, సుధాకర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.