Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని మండల స్పెషల్ ఆఫీసర్ సత్తార్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం ఘట్కేసర్ మండలం ఘణపూర్ గ్రామంలో పర్యటించి ఇంటింటికి మొక్కలు, చెత్త బుట్టల పంపిణీ, డంపింగ్ యార్డును పరిశీలించారు. పల్లె ప్రగతి మొదటి రోజు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆకస్మిక తనిఖీ చేసి సర్పంచ్ గోపాల్ రెడ్డి, కార్యదర్శి మధులపై హరిత హార కార్యక్రమంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు వారికి షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది. దీనితో గ్రామంలో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్ తాత్కాలికి డంపింగ్ యార్డు నుండి కొర్రెముల డంపింగ్ యార్డుకు చెత్తను తరలించాలని సూచించారు. డంపింగ్ యార్డు నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో ఎండిన మొక్కల చోట మరో మొక్కను నాటాలని, పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. గ్రామంలో ఇంటింటికి ఆరు మొక్కలు అందజేసి, చెత్త బుట్టలను అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి మధు, వార్డు సభ్యులు వేముల పరమేశ్వర్ గౌడ్, చిలుగూరి భాస్కర్, వేముల శోభ, వేముల శ్వేత, కో ఆప్షన్ సభ్యులు, నానావత్ సురేష్ నాయక్, లత రెడ్డి, నాయకులు వేముల సత్తయ్య గౌడ్, వేముల మహేశ్వర్ గౌడ్, వేముల శంకర్ గౌడ్, ఆశ వర్కర్లు, అంగన్ వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.