Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
స్వచ్ఛమైన గాలిని పొందడానికి హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ కోరారు. శుక్రవారం ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని చెట్లతోనే స్వచ్చమైన గాలి అందుతుందని, కరోనా సమయంలో ఆక్సీజన్ అందక ఎంతో మంది ప్రాణాలు వదిలారన్నారు. నేటి మొక్కలు వృక్షాలుగా ఎదిగి కాలుష్యం నివారించడంతో పాటు మనిషికి సరిపడ జీవ వాయువును అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి కవిత, వార్డు సభ్యులు గుమ్మడివెల్లి భాస్కర్, జువ్వ స్వామి, ఎరుకల దుర్గరాజ్ గౌడ్, మహిళ సంఘాల నాయకురాలు పాల్గొన్నారు.