Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
- తెలంగాణ దళిత సంక్షేమ సంఘం నాయకుల హర్షం
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జికి డా.జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు. శుక్రవారం స్థానిక కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్‌తో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా.బాబు జగ్జీవన్ రామ్ తాత్కాలిక విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఫ్లైఓవర్‌కు జగ్జీవన్ రామ్ పేరు పెట్టడంతో తెలంగాణ దళిత సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ దళిత సంక్షేమ సంఘం నాయకులు నల్లా విల్సన్, మాదాసు నర్సింహ, కల్మూరి శ్రీనివాస రావు, మోతె బాలరాజు, ఎడ్ల ప్రభాకర్, చింతా నర్సింగ్ రావు, మల్లిగారి లక్ష్మీనారాయనణ, మహంకాళి సూర్యనారాయణ, రత్నం, దండు రవి కుమార్, కృష్ణ మూర్తి, బాలానగర్ డివిజన్ అధ్యక్షుడు మందడి సుధాకర్ రెడ్డి, హనుమాన్ టెంపుల్ కమిటీ చైర్మెన్ ఎలిజాల యాదగిరి, మైక్రో స్మాల్ స్కేల్ ఇండిస్టీస్ చైర్మెన్ అంబటి సునీల్ గుప్తా, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు దారం సతీష్ గుప్తా, హోలియా దాసరి బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నగేష్ తదితరులు పాల్గొన్నారు.