Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-అంబర్‌పేట
నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని రాష్ట్ర మత్స్యశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్, బాపునగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలు, పట్టణాల సమగ్రాభివృద్ధికి ప్రణాళీకాబద్దంగా కృషి చేస్తున్నారన్నారు. అంబర్‌పేటలోని అతి పెద్ద నాలాతో వరద సమస్యలు తలెత్తుతున్నాయని, వరద సమస్య పరిష్కారానికి రూ. 39 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రజలు హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ విజరు కుమార్‌గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, డీఎంహెచ్‌వో హేమలత, డీఈలు చంద్రశేఖర్, సంతోష్, ఏడీలు గణేష్‌రావు, సత్య, శంకర్, ఏఈలు కుశాల్, శ్వేత, మల్లేష్, డీడీ మాలిని, శ్రీధర్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, ఆమనూరి సతీష్, లింగారావు, మల్లేష్‌యాదవ్, దయాకర్యాదవ్, సిద్ధార్థ ముదిరాజ్, రంగు సతీష్‌గౌడ్, రాగుల ప్రవీణ్, జాకిబాబు, మహేష్ ముదిరాజ్, పాక నర్సింగ్, పాక సంతోష్, మోసిన్, జాఫర్, తిరుపతి, మహమ్మద్‌గౌస్, నాగరాజ్, లవంగు నాగరాజు, రంగు ఉదరుగౌడ్, జమీల్, రాజ్ కుమార్, బేగం, షహిని, రేఖ, అరుణ, అనిత, శారద, భవాని, షాహినీ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.