Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
పట్టణ, పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మర్రిగూడెంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి పట్టణప్రగతిని ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై ఉన్న చెత్తాచెదారాన్ని తీసివేయాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఇంటి ముందు 6 మొక్కలు నాటాలని కోరారు. రోడ్డు, డ్రయినేజ్ , వీధిదీపాలు తదితర సమస్యలను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మర్రిగూడెంలోని బస్తీ దవాఖానను సందర్శించి హాజరు పట్టికను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీసీ శంకర్, ఈఈ కోటేశ్వర్ రావు, ఏఎంహెచ్ఓ మైత్రి, డీఈ రూప, డీజీఎం కృష్ణ, ఏఈలు ప్రత్యుష, వేణు, రమేష్, ఎస్ఎఫ్ఏ లలిత, స్వప్న, సిబ్బంది, మర్రిగూడెం అధ్యక్షులు కౌకుంట్ల అంజి రెడ్డి, ప్రధాన కార్యదర్శి తునికి నరేష్ గౌడ్, కృష్ణ రెడ్డి, సంజీవ రెడ్డి, బాలారెడ్డి, నర్సింహా, సైదులు, డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాండ వాసుదేవ్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు సానాల రవి, బుసాని రఘు, రూపేందర్ రెడ్డి, నాగారం చంద్రశేఖర్, మోహన్, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.