Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.18లక్షల విలువగల మూడు కార్ల స్వాధీనం
- ముగ్గురు నిందితుల అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కార్లను చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.18 లక్షల విలువగల మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్, మహబూబ్, అబిద్‌లు ఫ్రెండ్స్. 2014లో మహ్మద్ హుస్సేన్ హైదరాబాద్‌కు వచ్చి అత్తాపూర్‌లో నివాసముంటున్నాడు. కార్లను కొనడం, అమ్మడం చేస్తుండేవాడు. ఈ క్రమంలో న్యూ ఢిల్లీకి చెందిన అస్లామ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఢిల్లీలో కార్లను చోరీ చేసి, నెంబర్ ప్లేట్స్, ఇంజన్నెంబర్లను మార్చేసి అమ్మేవారు. 2019లో ఢిల్లీ పోలీసులకు చిక్కి జైలుకెళ్లారు. జైలు నుంచి విడుదలైన ఆ ఇద్దరు యూపీకి వెళ్లి అక్కడ సిఫ్ట్ కారును చోరీ చేశారు. కార్లను చోరీ చేస్తూ శంషాబాద్‌కు చెందిన కె.శేషు కుమార్, మధుసూదన్ అనే డీలర్‌కు తక్కువ ధరకు అమ్ముతున్నారు. శంషాబాద్‌లో ఐ20 కారును కూడా చోరీ చేశారు. ప్రత్యేక నిఘా వేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మహ్మద్ హుస్సేన్‌తోపాటు శేషు కుమార్, మధుసూదన్ ఇద్దరు కొనుగోలు దారులను అరెస్టు చేశారు.