Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7,684 మెట్రిక్ టన్నులకుపైగా సరఫరా
- ద్రవ రూప వైద్య ఆక్సిజన్‌ను సరఫరా చేసిన దక్షిణ మధ్య రైల్వే
- తెలంగాణ రాష్ట్రానికి 4,055 మెట్రిక్ టన్నుల ఎల్ఎమ్ఓ సరఫరా
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరాలో చేయడంలోదక్షిణ మధ్య రైల్వే కీలక పాత్రను పోషిస్తోంది. మహమ్మారి కాలంలో ఊహించని అనేక సవాళ్లను అధిగమిస్తూ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా 7,684.29 మెట్రిక్ టన్నుల ద్రవ రూప వైద్య ఆక్సిజన్ (ఎల్ఎమ్ఓ)ను రైల్వే విజయవంతంగా సరఫరా చేసింది. ఈ ఏడాది జులై 2న తెలంగాణ రాష్ట్రానికి 4,055.97 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓను, ఆంధ్రప్రదేశ్‌కు 3,628.32 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓను సరఫరా చేసింది. రాష్ట్రాలకు కావాల్సిన వైద్య ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు నడిపించారు. రెండు రాష్ట్రాలకు 100 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా 431 ట్యాంకర్లలో 7,684.29 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓను చేరవేసింది. ఒడిస్సా నుండి 3838.69 మెట్రిక్ టన్నుల ఎల్ఎమ్ఓ, గుజరాత్ నుండి 1793.10 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్ నుండి 1288 మెట్రిక్ టన్నులు, చత్తీస్‌గఢ్ నుండి 684.5 మెట్రిక్ టన్నులు, పశ్చిమ బెంగాల్ నుండి 80 మెట్రిక్ టన్నుల ఎల్ఎమ్ఓ సరఫరా చేశారు. తెలంగాణలోని సనత్‌నగర్ గూడ్స్ కాంప్లెక్స్‌కు 4,055.97 మెట్రిక్ టన్నుల ఎల్ఎమ్ఓ చేశారు.
గ్రీన్ కారిడార్ల ఏర్పాటు
రాష్ట్రాలకు కావాల్సిన ఆక్సిజన్ అవసరాలను వీలైనంత త్వరగా చేర్చడానికి రైళ్లు తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేరేలా రైల్వే గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ రైళ్లు వీలైనంత వేగంగా చేరేవిధంగా పర్యవేక్షణకు రైల్వేలో వివిధ విభాగాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటి ఫలితంగా, రైళ్లు సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి.
ఆక్సిజన్ సరఫరాకు ప్రాధాన్యత
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేగవంతంగా వైద్య ఆక్సిజన్ సరఫరా కోసం 'గ్రీన్ కారిడార్' పద్ధతిని ఏర్పాటు చేసి అమలుపరచడంలో కృషి చేసిన సంబంధిత అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రైళ్లను వీలైనంత వేగంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా ఇదే తరహ పర్యవేక్షణను ఇక మీదట కూడా కొనసాగించాలని ఆయన రైల్వే బృందాలకు సూచించారు.