Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నగరంలో పెరుగుతున్న కాలుష్యంను నివారించడానికి భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందచేయడం సమిష్టి బాధ్యత అని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలోనీ 4వ వార్డులో ఆదివారం 'పట్టణ ప్రగతి కార్యక్రమంలో జయ దర్శినిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డా.ఎన్.సత్యనారాయణ (ఐ.ఎ.ఎస్)తో కలిసి ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మొక్కలు నాటారు. అనంతరం 5వ వార్డు కొంపల్లిలో స్మతివనం అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములై సమగ్ర అభివద్ధి సాధించేందుకు కషి చేయాలని అన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రోడ్లు, నర్సరీలు, శ్మశానవాటికల ఏర్పాటుకు ప్రత్యేక దష్టివహిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదష్టితో కాలుష్యాన్ని అరికట్టి రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం తోడవ్వాలని అన్నారు. కొంపల్లి మున్సిపాలిటీి పరిధిలో అవసరమైన చోట మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి పచ్చదనాన్ని మరింత పెంపొందించేెందుకు కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కమిషనర్ రఘు, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్లు కుమార్‌గౌడ్, సంజు యాదవ్, సన్న రవి యాదవ్, రాజీరెడ్డి, శ్రీవిద్య ప్రశాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, నాయకులు సాయి కిరణ్ గౌడ్, జనార్ధన్, దేవేందర్, భూ లక్ష్మణ్, రాజు, శన్ను పాల్గొన్నారు.