Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
హిందూ ధర్మ గొప్పతనం, విశిష్టతలను జగద్విదితం చేసిన స్వామి వివేకానంద జీవితం అందరికీ ఆదర్శనీయం అని జీహెచ్ఎంసీి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఆ మహనీయుని వర్ధంతిని పురస్కరించుకుని తార్నాక డివిజన్లోని లాలాపేటలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిóగా టీటీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. విషవలయపు పాశ్చాత్య సంస్కతి పెచ్చరిల్లుతున్న కాలంలో హిందూ ధర్మ ఉత్కష్టత, జీవన విధానం, జగత్కల్యాణం కోసం భారతీయ సనాతన సంస్కతి ఆవశ్యకత, జగద్గురువుగా భారతదేశ స్థానములను విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు స్వామి వివేకానంద అని మీ జీవితంలో సవాళ్లను స్వీకరించండి. గెలుపోటముల ద్వారా మార్గనిర్దేశనం చేయవచ్చు అంటూ యువతకు స్ఫూర్తి రగిలించిన స్వామి వివేకానంద అని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సునీల్ ముదిరాజ్, మంత్రి వినోద్, పరశురాం, శివ శంకర్, గిరి, మెటుపల్లి శ్రీను, అంబల రమేష్, వారికుప్పల శ్యామ్, జనగామ యాదగిరి, జింకలు హరి, సాయి, బలరాం, అలీ, పద్మ, విజయ, గాయత్రి, వనజ, స్మిత, విజయ లాక్మి, పాల్గొన్నారు.