Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
మీర్పేట్ హెచ్.బి. కాలనీ వార్డ్ కార్యాలయంలో డైమండ్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్కి కాలనీకి సంబంధించిన సమస్యలను ముఖ్యంగా రిక్రియేషన్ జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలని విన్నవించారు. దానికి సంబంధించిన శాశ్వత పరిష్కారం చూపాలని, సీసీి రోడ్, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, తాగునీరు, ఎలక్ట్రిసిటీ సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండా రపు శ్రీనివాస్ రెడ్డి, డైమండ్‌హిల్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, ఇక్బాల్, అబీబ్, అఖిల్, ప్రభాకర్‌రెడ్డి, కష్ణారెడ్డి, సురేష్, నాగరాజు, కాలనీ వాసులు, టీఆర్ఎస్ నాయకులు వేముల సంతోష్ రెడ్డి, వీరేష్, బాలరాజు, నవీన్ గౌడ్, చంద్రశేఖర్, రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.