Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కృషి
- మున్సిపాల్టీలకు రూ.148 కోట్లు
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట
సీఎం కేసీఆర్ స్థానిక సంస్థలను బలోపేతం చేయడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని 18, 19, 20 వార్డుల్లో మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు మంత్రి అతిథిగా హాజరై శ్రీరాం కాలనీలో మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. పటణ ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయటం కోసం నిధులు ఇస్తూ ప్రజా ప్రతినిధులు, అధికారుల విధు లు నిర్వర్తించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెలా నేరుగా జల్పల్లి మున్సిపాల్టీకి రూ.48 లక్షల నిధులు మంజూరు చేయను న్నట్టు చెప్పారు. ఇందులో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కోసం ఖర్చు చేసేలా నిబంధనలు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న మున్సిపాల్టీలకు ప్రతి నెలా రూ.148కోట్ల నిధు లు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ప్రజలు ఆస్తి పాస్తులతో పాటు భవిష్యత్ తరాలకు మంచి వాతావర ణం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనీ, పచ్చ దనం పెంపొందించటానికి ప్రతి ఇంటి వద్ద ఆరు మొక్క లు నాటాలని సూచించారు. హరిత, స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో కలిసి పని చేయాలనీ, విద్యుత్ సమస్యలన్నింటినీ పట్టణ ప్రగతిలో భాగంగా పూర్తి చేయాలనీ, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన అందిస్తున్నారు. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ వాహనంలో మాత్రమే వేయాలని తెలిపారు. శ్రీరాం కాల నీలో నూతనంగా మంజూరు చేసిన రేషన్ షాపును ప్రార ంభించారు. అనంతరం ఉస్మాన్ సాగర్ చెరువును సంద ర్శించి రూ.21లక్షలతో చేపట్టిన చెరువు చుటు కట ్ట(బండ్) పనులను పరిశీలించి చెరువు సుందరీకరణకు మరో రూ.20లక్షలు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. గతంలో భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితులు పునరా వృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. జల్పల్లి పెద్ద చెరువు సుందరీకరణకు ఇప్పటికే రూ.9 కోట్ల నిధు లు విడుదల చేసినట్టు తెలిపారు. చెరువుల్లో డ్రయినేజీ నీరు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోటం, మంత్రి కేటీఆ ర్ ఆ దిశగా చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్, చైర్మన్ అబ్దుల్లా సాది, రిప్రజెంటెటివ్ వైస్ చైర్మన్ యూసూప్ పటేల్, ఏఈ కిష్టయ్య, కౌన్సిలర్లు లక్ష్మినారాయణ, శంకర్, శంషోద్దిన్, బాషమ్మ, మజర్ అల్లి, షేక్ పమీద అప్జల్, కో-ఆప్షన్ సభ్యలు సూరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు సుధాకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ జనార్ధన్, మాజీ అర్మిమెన్ వాసుబాబు, ఆంజనేయులు, వివిధ కాలనీల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.