Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
మార్నింగ్ వాక్‌లో భాగంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్‌రెడ్డి లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి ఆదివారం డివిజన్ పరిధిలోని అల్తాఫ్నగర్లో పర్యటించినారు. నూతన బాక్స్ డ్రైన్స్ మంజూరైన నేపథ్యంలో కొన్ని ఇండ్ల మధ్యలో నుంచి డ్రైన్స్ పోతున్న నేపథ్యంలో కాలనీ వాసులకు కొంత ఆస్తి నష్టం జరుగుతుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. బాక్స్ డ్రైన్ రావడం వల్ల బస్తీ వరద ముంపు నుంచి బయటప డుతున్న నేపథ్యంలో 2 ఫీట్ల స్థలం ఇవ్వడానికి బస్తీవా సుల అంగీకారం తెలిపారు. దాదాపు18 మంది ఈ స్థలం ఇవ్వడానికి ఎమ్మెల్యే ముందు ఒపుకున్నారు. ఈ సందర్బ ంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా బస్తీ పెద్దలు బాక్స్ డ్రైన్స్ నిర్మాణానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలి పారు. మరోసారి అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం మార్కింగ్ చేసుకుని ఎవరికి ఎంత ఆస్తి నష్టం జరుగుతు ందో అంచనా వేసుకుని పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఎక్కువ స్థల నష్టం జరగకుండా చూస్తామని హామీనిచ్చా రు. మీ అభిప్రాయలకు అనుగుణంగా అధికారులను ఈ ప్రదేశంలోకీ తీసుకొచ్చి పనులు ప్రారంభించడానికి సన్నా హాలు చేస్తామని తెలిపారు. బాక్స్ డ్రైన్స్ నిర్మాణం పూర్తయి తే కాలనీ వరదనీటి సమస్యల నుంచి పూర్తి స్థాయి లో విముక్తి లభిస్తుంన్నారు. నియోజకవర్గం పరిధిలోని ప్రధాన సమస్యలను దశలవారీగా పరిష్కారం చేసే విధంగా ప్రణా ళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తిలక్‌రావు, మధుసాగర్, కాలనీ వాసులు పాల్గొన్నారు