Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-నారాయణగూడ
రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణ కుల సంఘాలకు హైటెక్ సిటీ ప్రాంతంలో స్థలాలు కేటాయించిన విధంగానే బీసీ కుల సంఘాలు, సంచార జాతులకు ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పలు బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం బషీర్ బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అగ్రవర్ణ కుల సంఘాలకు రాష్ట్ర ప్రభు త్వం నగరంలోని హైటెక్ సిటీ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే భూములను ఆత్మగౌరవ భవనాలకు కేటా యించిందనీ, బీసీ కుల సంఘాలకు మాత్రం నగర శివా రు ప్రాంతాలు రాళ్లు, గుట్టలు, మానవులు తిరగలేని ప్రాం తాల్లో కేటాయించిందని ఆరోపించారు. బీసీ కులాలకు ఆత్మ గౌరవ భవనాలు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. బడుగు, బలహీన వర్గాలపై సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలనీ, వారం రోజు ల్లోగా హైటెక్ సిటీ ప్రాంతంలో బీసీ సామాజిక కుల సం ఘాలకు ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలు కేటాయిం చాలనీ, లేకపోతే రాష్ట్రంలోని 136 బీసీ కుల సంఘాలను కలుపుకుని, 'ఛలో హైదరాబాద్' పేరుతో 'ధర్మ పోరాటం' కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహిస్తా మనీ, అవసరమైతే ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ యువ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మ, ఉపా ధ్యక్షులు పానుగంటి విజరు కుమార్, గ్రేటర్ హైదరా బాద్ అధ్యక్షులు మాదేశీ రాజేందర్, సగర ఉప్పర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సగర, పలు బీసీి కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.